శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10. ప్రాస సకార వౌనటుల పద్యములల్లుట యేలనన్నచోన్
ప్రాసయటన్న రెండవది వర్ణము బాసర యందునుండుటన్
వ్యాసుడు, శ్రీ సరస్వతియు వాక్పతి వాక్కులు హంస హంసలున్
బాసకు ప్రాస, ప్రాసకును ప్రాసయు సాక్షర శాసకమ్ములే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని !శ్రీ సరస్వతీ!

11. శ్వాస సరస్సునందు నెలవౌ కలహంసలు హంసహంసలున్
వాసిగ సోహమాది ఘన వాక్యములన్నియు సాక్షరమ్ములే
బాసలయందునన్ పల్కున శక్తి సరస్వతీయమే
వాసర వాసినీ ప్రధిత వాగ్వరదాయిని! శ్రీ సరస్వతీ!

12. వ్యాసుల వారు వ్రాసిరట భారం సంహితనైన గాని ఔ
తోసము, శాంతియున్ దొరగి, తొల్లి యరణ్యములందు గ్రుమ్మరన్
ఆ సురవౌని నారదుల యానతి పొంది రచించె భక్తి వి
ద్యాసుధయైన భాగవతమట్లు తరించెను గాన భక్తి వి
శ్వాసమె మోక్ష సాదనము సంశయవౌచదువేలనమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వరదాయిని! శ్రీ సరస్వతీ!

13. ప్రాసలు నంత్యప్రాసలతో పద్యములల్లిననేమి తద్రసో
పాసన లేని శుష్కమగు పాండితి పోలిక, భక్తి భావనా
వాసన లేని పూజలు జపంబులు నిష్ఫలమమ్ము జూడగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342