శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వెన్న దుత్తను జూచియు వేగ జేర
కడగి మెల్లగా పాకుచు వెడలుచుంట
ఇంతలోపల ను యశోద ఎదురుపడగ
ఏమియు నెరుగ కున్నట్లు మోము ద్రిప్పి
చల్లగా జారుకొన జూచు నల్లనయ్య
చల్లగా చూచి మనలను సాకుగాక!

భావం: కన్నయ్యకు వెన్నదుత్త కనిపించింది. వేగంగా శబ్దం రాకుండా నేలపై పాకుతూ వెళుతున్నాడు. ఇంతలో యశోదమ్మ ఎదురుపడింది. ఏమీ ఎరుగని వాడిలాగా చల్లగా వెనుదిరిగి జారుకోబోయాడు. అలా యశోదమ్మకు దొరికిపోయిన నల్లనయ్య మనలను రక్షించుగాక!
తే.గీ. వెన్న హరియింప నేగిన వేళ లోన
స్తంభము నతన రూపమున్ తరచి జూచి
అన్యుడెవ్వడో తన వైన మరసెననియు
పలువిధమ్ముల మింబమున్ బ్రతిమిలాడు
ముద్దు కృష్ణుండు మనలకు ముదము గూర్చు

భావం: చిన్ని కృష్ణుడు వెన్నదొంగతనం చేద్దామని వెళ్లాడు. అక్కడ మణిస్తంభంలో తన ప్రతిమను జూచి వేరెవరో తన్ను గమనిస్తూన్నారనుకొని, తన ప్రతిబింబాన్ని బ్రతిమిలాడుతున్న ముగ్ధ మోహనకారుడైన బాలకృష్ణుడు మనకు ఎల్లప్పుడూ ఆనందమును కలిగించుగాక!

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949