శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేసిన నేతకాదు కడు నేర్పరియయ్యు తదీయ వస్తమ్రున్
ఏ సమయంబుగాని ధరియింపదు, తానుగ, కర్షకండు తా
వేసిన పంటనంతయును వేరొక వానికి జెందజేయు, తా
జేసినన పుణ్యమొక్కటియె జెల్లును కర్తకు గుర్తెరింగినన్
వాసర వాసిని ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!

అసును బోయువానివలె నాయువు వాయువు క్రిందు మీదు ను
చ్చ్వాసము నిశ్వసమ్ములతొ సాగుచు సాగుచు నాగిపోయెడున్
నీసము దీర్ణరూపగుణ నిశ్చల తత్వమె శాశ్వతమ్మగున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
ఆ సరసీరుహాసనుడు నందరి వ్రాతలు వ్రాయునంట, నీ
వాసరసీరుహాసనుని యాననమందె వసింతువంట రుూ
కాసర బీసరమ్ముల జగమ్ముల నేల సృజింతురమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!

న్యాసములాచరించియు రహస్యములౌ హఠయోగముద్రల
భ్యాసము జేసియున్ బహుళవౌ ఘన మంత్రములన్ బఠించియున్
వాసర జేరకున్న ఫలవంతము కావుగదమ్మ ఈశ్వరీ
వాసర వాసనీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342