శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసరి వాసమ్ను గుహకెవ్వడు బోవగ సాహసించు రా
కాసుల మూకలందు జొరగా జనియెవ్వడు సౌఖ్యమందు హిం
సాసహవాస జీవనము సంస్కృతి కారణవౌ గదమ్మ హే
వాసర వాసినీ ప్రధ్తి వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

దూసిన కత్తి యెప్పుడును దుస్సహ హింసకు కారణమ్మగున్
వేసిన పూల పందిరులు విచ్చిన పువ్వుల నిచ్చు మెండుగన్
జేసిన తీరు తెన్నులకె జెందును కర్మఫలమ్ములట్లుగన్
వాసర వాసనీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
మూసిన వాని కన్నులకు ముంగిట నెంతటి కాంతి రేఖలున్
భాసిలుచున్న నేమి యటు భాస్కరుడే నిలుచున్ననేమి ఆ
మాసపు కారు జీకటులె యావిధి పాపికి చిత్ప్రకాశమున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

హాస మనోహరమ్మగు సుహాసినులౌ చతురాంగనలన్ మనో
ల్లాసము గూర్చునప్పుడు విలాసమందున మున్గి తేలితిన్
హాసమె చంద్రహాసమటలై మది కోసెను రోసి పోయితిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342