శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోసితి గడ్డిగాదమును గోవుల గాసితి మట్టి పెల్ల పం
కాసుల కూడబెట్టుచును కారియ బెట్టితి తోడి బాలురన్
వాసినివనె్న దప్పితిని పాఠముల్ యెగగొట్టి యాడితిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

చేసితినేను దుందుడుకు చెయములెన్నియొ బాల్యమందున్
రోసిన నాదు తండ్రి నను రూక్ష పుశిక్షల పాలుసేయగన్
గాసిలు నన్ను జూచి కడు కారుణికంబుగ నాదు తల్లియున్
వాసర కుంకుమ మ్ము నిడె ఫాలమునందున పారె దయ్యముల్
వాసరవాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
వ్రాసితి నాది శంకరుల వాణికి తెన్గున పద్యమాలికల్
వ్రాసితి పద్య ఖండికల, వ్రాసితి నాటిక నాటకమ్ములన్
వాసర వాసినీ శతక పద్యములిప్పుడు పూర్తి చేసితిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

వాసర జేరితిన్ దొలుత భావ మరందియు రాజయాఖ్యడున్
నాసరి తోడురాగ నలనాడటు ముప్పది యేండ్ల క్రిందటన్
వేసట బడ్డమమ్ముగని వేదన జెంది మణమ్మ భక్తు రా
లాసర నంద జేసె కడు నాదర మొప్పగ నాటి నుండియున్
నీ సముపాసనా విధులనే నెరవేర్చునుంటినమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయినీ ! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342