శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసితి మేము నీకు నభిషేకము పుష్కరిణీ జలమ్ముతోన్
చేసితి మేము పూజలును సేవలు సుస్వర రుద్ర పాఠముల్
అసరి యర్థరాత్రమున యదుభతవౌ కలలోన నాకు నీ
యాసలు దీరునంచు వరమందగ జేసితివమ్ము నాడు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

వాసరయందు నీదు గుడి వాకిట గాంచిన స్వప్నముల్ జపో
పాసక శ్రేణి కంతటకు వాస్తవమైన వరప్రదానముళ్
వాసికి, హస్తివాసికిని, వాక్ ఝరికిన్ కవితా ప్రశస్తికిన్
భాసుర మంత్ర సిద్ధికిని భావి శుభం కర సూచకమ్ములౌ
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!
వాసర నాకు సుస్థిర నివాసము కావలె నీ జపో
పాసనలే నిరంతరము పావన జీవన భావనమ్ములై
పోసనరింప గావలెను పోవలె నైహిక తుచ్ఛ వాంఛలున్
వాసర వాసినీ ప్రథిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

శాసకుడైన రాజునకు శస్తమ్రు శాసనమె బలమ్ము వి
ద్యాసము దార విప్రునకు దాంతియు శాంతియు శాస్తధ్రర్మముల్
ఏ సిరి లేనివానికిక యెవ్వడు దిక్కగు నీవెనమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342