శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాసయునొక్కటే మరియు భావమదొక్కటె భక్తి భావమున్
వ్రాసెడు ఛందమొక్కటియె వస్తువదొక్కటె భారతీయమున్
వాసర క్షేత్ర మొక్కటియె వాహిని గౌతమి తీర్థమొక్కటే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

భాసుర భానుబింబము , నభంబును వాయువు, నగ్ని నీరమున్
వాసితమైన యాత్మయును వందితవౌ పరమాత్మ తత్వమున్
ఆ సరితీరు జూడగను నంతయునొక్కటె నీవు నేనుగన్
వాసరవాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
ఆ సవితాంత రాంతరమునందలి శక్తివి నీవె, చంద్ర సం
వాసితవౌ కళాత్మకవు, భగ్గున మండెడు అగ్ని మూర్ధవున్
శాసకవౌ గురుప్రభువు శంకృతి వాగ్బుధ శుక్రమూర్తివిన్
శ్వాసకు రూపవౌ శనివి, ఛాయలు రాహువు కేతువీవె హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

వాసవుడాది దిక్పతులు వారు త్రిమూర్తులు పంచ భూతముల్
రాసులు తారకల్, దివము, రాత్రులు మేరు సుమేరు చక్రముల్
భాసమ భాసవౌ భువన భాండములన్నిట శక్తి వీవె హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

-ఉమాపతి బి.శర్మ 9246171342