శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ.శ్రు. నీ సముదార రూపమును నిర్మల చిత్తమునందు నిల్పి నే
వ్రాసితినమ్మ నీ శతక పద్యములన్ పరిపూర్ణ భక్తితోన్
ఏ సమయమ్ము గాని పఠియించిన వారికభీష్ఠ సిద్ధులున్
భాసుర వాగ్విభూతి ఫలవంతములై పరిపూర్ణ మందుతన్

శ్లో॥ ఓం కారోజ్వల రూపిణీం భగవతీం ఐంకార వాగీశ్వరీం
హ్రీంకార ద్భుత శక్తి చేతన కరీం శ్రీంకార సంపత్ప్రదాం
ఐం బీజాక్షర సంయుతాం సువిదితాం క్లీంకార కామేశ్వరీం
సౌః దేవీ సకలార్థ మంత్ర విదితాం వందే జగద్రూపిణీం
కం. నా తండ్రి తోలుదాల్పరి
నా తల్లి నగేంద్రజాత నా సోదరులా
మాతంగ శీర్షుడును పా
ణ్మాతురుడును నిచ్చుగాత మహిత శుభమ్ముల్

ఉ. శ్రీ గణనాథునిన్ గొలిచి చిత్తమునందున సత్కవిత్వ ధా
రాగతి సాగ, స్వాంతమున నంబుజ సంభవు రాణి వాణికిన్
సాగిలి మ్రొక్కి భక్తి మెయి చల్లని తల్లికి మేలుకొల్పులన్
వేగ రచించి పాడెదను వేడెద నర్థ పదార్థ సిద్ధికై

-ఉమాపతి శర్మ 9246171342