శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. నందనందను శుభవందనార వింద
చంద్రికాదర్శనానంద సమయమందు
తనువునయన మయమ్మైన తనవి తీ రు
నని తలచిరి వ్రజాంగనల్ మనమునందు

అంతలో వేణు నాదమ్ము లలల వోలె
కర్ణపుటమములదాకగా కనులుగాదు
మేను చెవులతో నిండిన మేలటంచు
భావనము జేసిరి మధుర భక్తితోడ
భావం: నంద నందనుని సుందరరూపాన్ని చూసిన గోపికలు ఒళ్లంతా కన్నులైతే బాగుండుననుకున్నారట. ఇంతలో మురళీ కృష్ణుని వేణునాదం చెవులను తాకింది. అపుడు కన్నులు గాదు ఒళ్లంతా చెవులైతే బాగుండునని భావించారట గోపకాంతలు. కృష్ణుని రూపాన్ని ఎంత చూచినా, మురళీ నాదాన్ని ఎంత విన్నా తృప్తి కలగదని గోపికల మనో భావన. (శ్రీశరణుడు)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949