శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. వాయు వశంబునన్ జలధి వారికణమ్ములలోన బుట్టి త
ద్వాయువశంబునన్ విపుల వారధిలోన బుడుంగునన్ క్షణ
ప్రాయములో నశించు నచిరమ్మగు నీటి బుడంగ వోలె నీ
యాయువు ప్రాణ వాయువులు నంతము బొందు గదమ్మ ఈశ్వరీ!

శా. శ్రీ విద్యాధర యక్ష పన్నగ సుర స్వృష్ట పాదాబ్జ! సు
శ్రీవేణి భర సంతతార్చిత మహోహ్రీంకార! వేదాంగ వి
శ్రావోదార! జగన్మరుూ ! హరి హరబ్రహ్మేంద్ర సంసేవనా
శ్రీ వాల్యభ్య! జగత్రయైక జననీ ! శ్రీ వాసరాధీశ్వరీ!
మ. ధృత పాశాంకుశ పుష్పబాణ! కలిత శ్రీకార హార ! సమా
వృత నానావిధ శక్తి జాల ! మహిత శ్రీచక్ర గేహా! ప్రమా
పిత భండాది భయంకరాసుర! మహాభీలా! జగల్లీల సం
శ్రీత లోకైక కృపానిధాన! జననీ శ్రీ వాసరాధీశ్వరా!

మ. హే కాత్యాయనీ దానవ ప్రమధనీ ! హే దేవతాలోక ర
క్షాకర్త్రీ! బహుకల్పక క్షయకరీ! కల్పాంత సృష్టింకరీ!
హే కైవల్య పద ప్రదాయిని జగద్దేలా సుఖేలాకరీ
శ్రీ కారుణ్యగుణా! త్రిలోక జననీ! శ్రీ వాసరాధీశ్వరీ!

-ఉమాపతి శర్మ 9246171342