శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేణు గానం - లేడికూన
తే.గీ. అమృతని భవేణు నాదమ్ము నాలకించి
చెంగు చెంగున నెగురుసారంగతతులు
కన్ను లానంత జలధులై గాలుచుంట
మేత మేయుట మరిచియు మెలగుచుండె

భావం: బృందావనంలో సంచరించే లేడికూనలు మురళీమోహనుని, అమృతోపమానమైన వేణునాదాన్ని ఆలకించి కన్నులలో ఆనంద బాష్పాలునిండగా మేత మేయడం కూడా మరచిచెంగు చెంగున గంతులేస్తున్నాయట.
పుష్పవృష్టి
తే.గీ. శ్యామ వర్ణాన్వితంబైన జలద సమితి
పుష్ప వృష్టిని గురిపించు పొలుపుగలిగి
హరికి నాతపంబడగించు నాతపత్ర
మనగ, ఆకాశవీధిలో నడరుచుండె

భావం: ఆకాశంలోని నల్లని మేఘ సమితిని చూస్తుంటే మాధవునకు ఎండనుంచి రక్షణకోసం పట్టిన గొడుగులాగా భాసిస్తూ ఉంది. పైగా మాధవునిపై ఆ మేఘాలు పుష్పవృష్టిని కూడా కురిపిస్తున్నాయి.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949