శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. గోపాల బాలుని గో పాలనంబును
ప్రత్యక్షముగ జూచు భాగ్యగరిమ
గోపాల దేవుని గోవర్థనోద్ధార
కార్యనిర్వహణంబు గాంచు కలిమి
విశ్వాంత రాత్ముని వేంనాదమ్ములా
కర్ణించు కర్ణముల్ గల్గియుంట
నంద నందనుని ఆనంద కేళీవిలా
సంబులక పరోక్ష సాక్షులగుట

ఆ.వె. సులభ సాధ్యమనియు కలనేని యనరాదు
ఎంత తపము జేసి, ఎంత వేచి
వేణు ధరుని తోడ వ్రేపల్లెవాసులు
ఆటలాడినారో అనవరతము
*
భావం: గోపాలుడు గోవులను కాస్తూండగా ప్రత్యక్షంగా చూడడం, గోవర్థన గిరి నెత్తుతూంటే సంభ్రమాశ్చర్యాలతో తిలకించటం, వేణు గోపాలుని వేణునాదాన్ని తమ చెవులతో వినడం, నంద గోపాలుని లీలావిలాసాలకు ప్రత్యక్ష సాక్షులవడం - ఇవన్నీ సులభంగా సాధ్యమయ్యేవికాదు. ఎన్ని జన్మలు తపస్సు చేసి, ఎన్ని యుగాలు వేచి ఉంటేనో సాధ్యమయ్యెను సంగతులవి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వేణు గోపాలునితో ఆడి పాడిన వ్రేపల్లెలోని గోప బాలురు ఎంతటి పుణ్యాత్లులో కదా.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949