శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందుని నోముల పంట
నందుని నోముపంట, సురనందన సుందరకల్పశాఖి, ఆ
నందపు కందుకంబు, కననాయదుశంపుసాంధ్ర కీర్తి మా
బంధుర మానసుండు, మునివందిత శ్రీచరణార విందుడున్
స్యందన మందు వచ్చె మన జన్మము పండగ రాజధానికిన్
భావం: మధరాపురానికి రధంలో విచ్చేస్తున్న శ్రీకృష్ణుని చూసి అచ్చటి యువతీ లలామ లీవిధంగా భావిస్తున్నారట. నందుని తప్ఫఃలం, దేవతల నందోనాద్యవనంలోండే కల్పవృక్షం, యదువంశపు కీర్తిసారం, హృదయంలో లక్ష్మిని నిలుపుకున్నవాడు,మునివందిత శ్రీచరణావిందుడు ఐన శ్రీకృష్ణుడు రథంలో మన మనోరధం ఈడేరగా మనజన్మం సార్థకం కావడానికి అన్నట్టుగా రాజధానీ నగరమైన మధురకు నేడు విచ్చేశాడు.
రంగవల్లులు
విందులారగించెడు నరవిందలోచ
నలును వదిలి వచ్చిరి అబ్జనాభుగనగ
విరుల కొల్లగా కొప్పున తురుముకొనిన
పడతులిళ్లముంగిట రంగవల్లులట్లు
వరలుచుండిరి కృష్ణుండు వచ్చువేళ
భావం: శ్రీకృష్ణుడు మధురకేతెంచి నాడని తెలిసి విందులారగస్తున్న సుందరీమణులు కూడా వేగమే వానిని చూడడానికి విచ్చేశారట. కొప్పులలో వివిధమైన రంగుల పుష్పాల నలంకరించుకొని ఉండడం వల్ల వారు ఇళ్లముంగిట రంగవల్లుల్లాగా భాసించారట.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949