శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచినీళ్లప్రాయమే!
మున్ను పాషాణమును తాకి ముదిత జేసి
నట్టి నీకు త్రివక్ర అతివనొక్క
చెలవ మొప్పెడు భామగా సేయుటన్న
మంచినీళ్లప్రాయముగదా! మాన్యచరిత!
భావం: కృష్ణా! మున్ను రామావతారంలో రాయినే అందమైన అహల్యగా మార్చినవాడివి, త్రివక్రయై సంచరించే కుబ్జను అందమైన భామగా మార్చడంలో ఆశ్చర్యమేముంది? నీ పదము సోకితే జడపదార్థానికే చైతన్యం వచ్చినపుడు చలించేరూపం అపురూపమైన సుందరరూపంగా మారడంలో అబ్బురమేముంది?
కంస ధనుర్భంగం
కంస భూపతి ఆయుధాగారమందు
భద్రమై యున్న ధనువును పట్టి ఎత్తి
విరచినావని విందును వీనులార
పాత దౌపని నీకది పంకజాక్ష!
భావం: కృష్ణా! కంసుని ఆయుధాగారంలో ఉన్న గొప్ప ధనుస్సును ఎత్తిపట్టి ఎక్కుపెట్టబోగా విరిగి పోయినదని విన్నాను. నీకు ఇదేం కొత్తకాదు కదా. రామావతారంలో శివుని విల్లును విరిచిన వానివి నీవే కదా. కంసుని విల్లు నీకు ఒక లెక్కలోనిది కాదుకదా.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949