శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపరిపాలకుడు
తండ్రిని చెరలో బెట్టియు తానెపట్ట
మంది గర్వించు కంసుని హతము జేసి
ఉగ్రసేనునకున్ రాజ్యమొసగినట్టి
ధర్మపరిపాలకుడ వీవె, ధన్యచరిత
భావం: కంసుడు తన తండ్రియైన ఉగ్రసేనుణ్ణి చెరసాలలో బంధించి తానే పట్టం గట్టుకొని బలగర్వితుడై పరిపానల సాగిస్తూ ఉన్నాడు. కంసుని సంహరించిన తరువాత ఉగ్రసేనుడు కృష్ణుడిని రాజుగావలసింది అని వేడుకోగా కృష్ణుడు ఉగ్రసేనుడికే పట్టం గట్టాడు. రాజ్యాన్ని తృణప్రాయంగా చూడడమూ నీకు కొత్తకాదుసుమీ.
కన్నవారని మిమ్ములనన్ని నాళ్లు
మనమునందున భావించి మసలుకొనుచు
ఇంతవారమైతిమిగ మీ ఎలమిచేత
మీ మమతయే మదిసతము మెదలుచుండు
కన్నవారిని సేవించి కొన్ని నాళ్లు
వచ్చెదము మేము మరల వ్రేపల్లెకున్ను
భావం: మధురాపురంలో బలరామకృష్ణులు సాధించిన విజయాలు తెలుసుకొని నంద యశోదలు రేపల్లెనుంచి కృష్ణుని దగ్గరకు వచ్చారు. వారిని చూసి ఎంతో ఆదరించి సత్కరించి మీరు మమ్ములను పెంచి పెద్దచేసినందుకృతజ్ఞత చూపి,ఇపుడు మా కన్నతల్లిదండ్రులను కూడా కొన్నాళ్లు సేవించి , తిరిగి మీ చెంతకు వస్తాం అని యశోదానందులను బలరామకృష్ణులు ఊరడించారు.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949