శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరూ దేవతలే
అతి రహస్యముగ పరముడాహరునకు
పూని బలరామ కృష్ణులు పూజసేయ
శివుడె తావచ్చి తన కేల స్వీకరించె
దాని గన్న సాందీపని తలచెనిట్లు
వీరు మానవ మాత్రులుగారు ధరకు
వచ్చి తిరుగాడు చున్న దేవతలుగానీ
భావం: సాందీపని ఆశ్రమంలో బలరామకృష్ణుడు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఒకరోజు అన్నదమ్ములిరువురూ పరమేశ్వరుని ఆరాధించడం, ఆ పూజను పరమశివుడు స్వయంగా స్వీకరించడం చూసి వీరు మానవ మాత్రులుకారు దేవలోకంనుంచి భూలోకం లోకి వచ్చి నడియాడే దేవతలే అనుకున్నాడు.
కనక దేవతాగణములు ఘనులు మునులు
పట్టు బట్టియు వేలాది వత్సరములు
తపము జేసిన గాని సాధ్యమ్ము కాని
నీరజాయుపదముల పై నిండు భక్తి
మీకు గల్గెను మీభాగ్యమేమనందు
భావం: గోపికలారా! మహర్షులు, దేవతలకు వేల సంవత్సరాల తపస్సు చేత కానీ సాధ్యంగాని నీరజాక్షుని పై నిశ్చలమైన భక్తి మీకు సులభంగా సాధ్యమైంది. మీ భాగ్యాన్ని ఏమని పొగడగలను ఉద్దవుడు అనుకొన్నాడు

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949