శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరంగాననున్నట్టి యార్గురైన
కామక్రోధాది శత్రుమూకలనుఁ దరుమఁ
గొట్టఁ బూనరు పోషించు కునెదరకట
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!
భావం: అంతరంగాన కొలువు దీరిన అరిషడ్వర్గమైన కామక్రోధలో భమోహమదమాత్సర్యాలను తరిమిగొట్టరు. సరికాదా! పెంచి పోషించుకుంటున్నారు. అయ్యో! కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.
ముసలి వారన్న వారల మూల్గులన్న
స్వంత రక్తంబునకసహ్యమింత దయయు
లేకపోయెను దారుణమే కనంగ
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం: నేటికాలంలో ముసలివాళ్లన్నా, వాళ్ల మూల్గులన్నా కడుపున పుట్టిన సంతతికె అసహ్యం. రవ్వంత కనికరమైనా లేదు. ఆలోచిస్తే ఎంత దారుణం? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262