శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంక్తి భోజన సంస్కృతిఁబార ఁ ద్రోలె
బిచ్చమెత్తెడి రీతిన వేగఁబోయి
చేతఁబళ్ళాలు పడుదురే చిత్రరీతి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పంక్త్భిజన సంస్కృతిని బారద్రోలారు. బిచ్చమెత్తిన విధంగా త్వరత్వరగా పోయి చేతులతో పళ్లాలు పట్టుకుని బారులు కడుతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ చూడవయ్య!
ఇంట వండినవౌ పిండివంటలేవి
నేటివారికి నచ్చక బైటకరిగి
దిక్కుమాలిన వేవియో తినమరింగె
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: నేటికాలంలో ఇంట్లో వండిన పిండి వంటలు నచ్చక బైటకు వెళ్లి దిక్కుమాలిన తిళ్ళు ఏవేవో తినమరుగుతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262