Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ‘‘గౌతమా’’!అంటూ ఎలుగెత్తి పిలిచాడు విశ్వామిత్రుడు. గౌతముడు పరుగెత్తుకొచ్చాడు. తమ జీవితాల్లో వెలుగుల్ని నింపిన ఆ శ్రీరామలక్ష్మణులకూ, విశ్వామిత్ర మహర్షికీ పాదాభివందనం చేశాడు. ఒక పూర్ణచంద్రుడు భూమిని వాటేసుకున్నట్లుగా, అహల్యను వాటేసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. ముద్దులతో ముంచెత్తాడు. వారివద్ద సెలవు తీసుకొని, ఆమెతోపాటు హిమవత్పర్వత సీమలకి తపస్సుకై నిష్క్రమించాడు గౌతముడు.
అలా, మళ్ళీ వారి జీవితాల్లో సూర్యోదయమైంది.
ఒక మహానక్షత్రం వెనుక ఒక సూర్యుడూ, సూర్యప్రభలా విశ్వామిత్ర మహర్షి వెనక శ్రీరామలక్ష్మణులు నడిచి వెళ్ళారు వౌనంగా!
మిథిలానగర ప్రవేశం
వౌనమ్మే జటలు గట్టి మునివోలెను మారినట్లు
విపినమ్మే నగర సోయగాల జూడవచ్చినట్లు.

విశ్వామిత్రుడు మిథిలానగరమ్మున నడవసాగె
అతని కనుల సూర్యచంద్ర కాంతులు దొర్లాడసాగె.

అడుగడుగున అందాలను గనుచు అడుగు కదలించుచు
అడుగులోన అడుగు నిడుచు- అతని వెంట రాఘవుండు.

ఒక సాగర కెరటమ్మే నిలువెత్తున నిలిచెననగ
ఒక పర్వత శిఖరమ్మే తలనెత్తుకు నడిచెననగ.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087