శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యమూర్తుల కష్టాలు పుష్కలంబు
పాపకర్ముల సుఖమెన్న బహువిధాలు
పాపపుణ్యాల తీరిది వరుసఁ గాంచ
చూడమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పుణ్యాత్ములు పడే కష్టాలు పుష్కలంగా ఉన్నాయి. పాపాత్ములు అనేక విధాలుగా సుఖసంతోషాలు అనుభవిస్తున్నారు. పాపపుణ్యాల తీరు చూడవయ్య సూర్యదేవ!

సెంటు భూమికై సోదరులింట మంట
లారనట్టుల ఁ బోషింతురరయ చోద్య
మకుట! ఘోరాతి ఘోరమీ మార్గమేల
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: సెంటు భూమికోసం అన్నదమ్ములు ఆరనిమంటలను తమ ఇంట పెంచి పోషించుకుంటున్నారు. ఘోరాతి ఘోరమైన ఈ మార్గాన్ని అనుసరించడం దేనికి? చూడవయ్య సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262