శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచితనమును గుర్తింపరెంచబోరు
దానినసమర్థతని యెంచి దారుణముగ
నేరి పారేతు రిలలోన నిక్క మిదియు
చూడమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మంచితనాన్ని గుర్తించరు సరికదా లెక్కచేయరు. మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్నారెంత దారుణం? అలాంటి మంచి వాళ్లను ఏరిపారేస్తున్నారన్నది నిజం. చూడవయ్య సూర్యదేవ!
కట్టు జారిపోయెనుకదా! బొట్టు కాన
రాదు గాజులు ధరియింపరాయెఁ గాంచ
కాటుకన్నది కండ్లకు ఁ గానరాదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: నేటికాలంలో చాలామంది ఆడవాళ్లు సంప్రదాయ దుస్తులు ధరించడంలో ఇష్టాన్ని చూపడం లేదు. ముఖాన బొట్టు, కళ్లకు కాటుక కనిపించకుండా పోతున్నాయి. చూడవయ్య సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262