శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విందులు వినోదముల పేర విత్తమధిక
ముగను వెదజల్లెదరు కాని మూల్గువారి
కొక్క మెతుకు విదల్చరే కొసరైన
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం:విందులు వినోదాల పేరుతో డబ్బెంతో మంచినీళ్లప్రాయంగా ఖర్చుచేయడానికి పూనుకొంటారు. గానీ పేదవానికి ఒక్క మెతుకు విదల్చరే. కర్మసాక్షివైన ఓ సూర్య దేవా! చూడవయ్య!

కాలమెంత మారినగాని గణన సేయ
బోరె యాడపిల్లని నెత్తినోరు బాదు
కునెడి హీనులు కొల్లలు గనగ జగతి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: కాలమెంత మారినా ఆడపిల్ల పుట్టిందని పెదవి విరచడమే కాదు నెత్తినోరు బాదుకుంటూ ఏడ్చేవారే ఈ లోకంలో అధికంగా ఉన్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్యా!

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949