శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి గల వారలిక్కట్లు బహువిధంబు
లదియు లేనట్టి వారిండ్ల లాసమలరు
దైవలీలలు చిత్రాలుధరిణి ఁగాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అత్యంత భక్తి ప్రవత్తులు కలవారు అనేకవిధాలుగా కష్టాలనుభవిస్తున్నారు. భక్తి భావన లేశమాత్రం లేని వారిళ్ళల్లో ఆనందం తాండవిస్తోంది. ఈ భూమి యందు దైవలీలలు చాలా చిత్రంగా ఉంటాయి. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడువయ్య.
మంచి వారలు సుఖపడుమాటలేదు
చెడ్డవారిని సుఖములు చేరవచ్చుఁ
బుణ్యమూర్తుల కష్టాలు పుష్కలంబు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మంచివాళ్లు సుఖపడమనేదే ఉండదు. సుఖాలు తమంతట తామే చెడ్డవారి దరికి చేరుకుంటాయి. పుణ్యమూర్తులు పడే కష్టాలు పుష్కలం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్యా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262