శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరలు జువ్వలై తారాపథమ్ము నంటె
రూకలకు విలువేది రుూరోజులందు
బ్రతుకుభారమై పడిపోయె గతుకులందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ధరలు తారాజువ్వలై తారాపథాన్ని తాకుతున్నాయి. ఈరోజుల్లో రూపాయలకు విలువేలేకుండా పోయింది. బ్రతుకుభారాన్ని మోయలేక గతుకుల్లో పడిపోయింది. కర్మసాక్షివైన ఓ సూర్య దేవా ఓసారి చూడవయ్య.
కలిసియుండంగ నోపరు కాలమహిమ
విడివిడిగ యుండ లాభాలు వేయి విధము
లనుచుఁ గుంచిత తత్త్వంబు కనగనేడు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం: కాలమహిమ కారణంగా ఎవరూ కలసి ఉండడానికి ఒప్పుకోవడం లేదు. సరికదా వేరింటి కాపురాలు పెడితేనే వేయివిధాలుగా లాభాలుంటాయనే సంకుచితత్వమే నేడు కనబడుతోంది. కర్మసాక్షివైన ఓసూర్యదేవా చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262