శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేయవలసిన శ్రమ మదిఁ జేయకుండఁ
బూని నడకలు పరుగుల ఁ బోవువారు
అగణితంబుగ ఁ గన్పట్టు నరయ నేడు
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: ఏ మాత్రం శ్రమ పడకుండా పనిగట్టుకుని వాకింగులకు, జాకింగులకు పూనుకొంటున్నారు. అలాంటివాళ్లు అసంఖ్యాకంగా నేడున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా కాస్త కనిపెట్టవయ్య .
విషపు నవ్వులు పాపపు విధుల తోడఁ
గల్మషత్వంబుఁ గల్గిన కర్మఠాలి
కనులు తెరచిన ఁగన్పట్టుకనులముందు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: విషపూరితమైన నవ్వులు పాపకార్యాలతో మనసు నిండాకల్మషత్వం గల్గిన కఠినాత్ములే కళ్లు తెరిస్తే చాలు మన కళ్లముందు కదలాడుతారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262