శ్రీకృష్ణ లీలారింఛోళి

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మాయలోఁబడి పోతినేలోయగాంచఁ
జేతినందివ్వరెవరు నా చేరువందు
బయటపడు మార్గమేదో చనీయరకట
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పార్వతీపరమేశ్వరా! మాయ అనబడే లోతైన లోయలో పడిపోయానయ్యా. మాయ కూడా నీ చాతుర్యమే శివా కానీ శివమాయలో పడిన నాకు నా చేరువలో ఉన్న వారెవరు చేయూతను అందించడం లేదయ్యా. అవిద్య అనే మాయలోయ నుంచి బైటపడే మార్గమే తోచనీయరు స్వామీ. నీవే నన్ను అనుగ్రహించి నీ సన్నిధిని నాకు కృపచేయుము శివ. శరణు శరణు శంకరా! నీవు తప్ప ఇతఃపరం బెరుగనయ్య శివా!
తే.గీ. ఆర్గురైనట్టి శత్రువులంతరంగ
మందుఁ జేరియు ననుఁ దల్చి మట్టుపెట్టఁ
బూనిరవ్వారిఁ దరుమంగఁ బూను వయ్య
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: కామక్రోధాది అరిషడ్వర్గం నా అంతరంగంలో ప్రవేశించి నన్ను మట్టుబెట్టాలని నిశ్చయించుకుందయ్య. దాన్ని గుర్తించి దూరం చేసుకొనే తెలివితేటలు నాకు లేవు శివా. నీవే పూనుకొని నాలోని ఆర్గురు శత్రువులు తరిమి నాచే నిరంతరం శివనామం పలుకేటట్టు చేసే శక్తినిమ్ము శివా. శివస్మరణ తప్ప అన్యం తెలియని నన్ను నీవే కాపాడి నాకు శాంతిని ప్రసాదించడానికి పూనుకోవయ్య శివయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262