శ్రీకృష్ణ లీలారింఛోళి

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చల్లనయ్యవు శంకరా! యుల్లమలర
నీదు నామమ్ము జపియింతు నెల్లవేళ
లందు విడువను విడువకు మిందు ధారి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! నువ్వు చల్లనయ్యవయ్య. మనోరంజకంగా నీ నామాన్ని ఎల్లవేళలందు విడువకుండా జపిస్తుంటాను. నా మనసు ఎల్లపుడు నీ కథలు వినడంలోను, చెప్పడంలో ఆనందాన్ని పొందే భాగ్యాన్ని నాకు నీవే కల్పించాలి శివా. నేను నిన్ను సదా మరవకుండా నీ నామస్మరణ చేస్తుంటాను. అలాగే నువ్వు కూడా నన్ను విడువకుండుమయ్య ఓ ఇందుధారీ!.

తే.గీ. గరళవౌపోసనము వట్టి గాచినావు
రక్కసుల మూకలకు ఁ గూడ రమ్యమైన
వరములొసగు దయామయా! వరప్రదాత!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ దయామయా! వరప్రదాతా! పార్వతీ పరమేశ్వరా! గరళాన్ని ఔపోసన పట్టి సమస్త విశ్వాన్ని కాపాడిన విశ్వ రక్షకుడవయ్య నీవు. అమృతోత్పాదనలో హలాహలం పుట్టి లోకాలన్నీ తల్లడిల్లుతుంటే వారికందరికీ శుభాన్ని కూర్చడానికి నీవు గరళాన్ని నీ కంఠాన పట్టి ఉంచావు శివా. నీకు వారువీరను భేధమేమీ లేదు. అందుకే రాక్షసమూకులకు సహితం అద్భుతమైన వరాలను ప్రసాదించే నీవు నిజంగా బోళాశంకరుడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262