శ్రీకృష్ణ లీలారింఛోళి

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మంచివానికి స్థానమ్ము మహిన లేదు
వానినసమర్థుడని యెంచి బహు విధాల ఁ
జుల్కనగఁ బల్కు వారెలచ్చోట ఁ గనిన ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ భూమీద మంచివానికి సముచిత స్థానం దొరకడం లేదు. అదేగాక మంచివాడిని అసమర్థుడుగా కూడా లెక్కబెట్టుకడుతున్నారు. ఎక్కడ చూసినా అనేకరకాలుగా చులకనగామాట్లాడుతున్నారు. మంచివారి చేష్టలను చేతకానివాని చేష్టలవలె వెక్కిరింపుకు గురి అవుతున్నాయ. కర్మసాక్షివైన ఓ సూర్యదేవరా నీవే చూడవయ్య.

తే.గీ. వాడకూడని ప్లాస్టిక్కు వాడి వివిధ
రోగముల బారిఁ బడియు నారోగ్య భాగ్య
సంపదనుఁ గాలఁ ద్రనె్నడి జనులు గలరు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: వాడకూడని ప్లాస్టిక్కు పదార్థాలు వాడి వివిధ రోగాల బారిన పడుతూ ఆరోగ్య భాగ్య సంపదను కాలదనే్న జనులెందరూ ఈ భూమిమీద ఎక్కువ అవుతున్నారు. వాడకూడదని, వాడితే ఎంత నష్టమొస్తుందో తెలుసుకొని కూడా ఆ ప్లాస్టిక్ వాడకుండా ఉండలేకపోతున్న ఈ మనుజులను చూసి కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైన వారికి కనువిప్పుకలిగించవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262