శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అకట! కుంకుళ్ళు వోయె పీడకల నిజము
చేయుటకును రసా లేవొ శీఘ్రగతిన
రాగ కేశంబులూడుచు రాలుచుండె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అయ్యో! కుంకుడు కాయ రసంతో చక్కగా తల రుద్దుకునే కాలం పోయింది. జుట్టు తెల్లబడిపోతున్నట్లుగా, రాలిపోతున్నట్లుగా వచ్చే పీడకలను నిజం చేయడానికి రకరకాల షాంపూలు వేగంగా వచ్చి పడిపోవడంతో చక్కటి శిరోజాలన్నీ ఊడిపోతూ రాలి పోతున్నాయి. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య!

తే.గీ. మోయలేనట్టి బరువులు మోయుచున్న
చదువుకొను బాలలిక్కట్లు శతవిధంబు
లేల? దారుణమని యెంచరేల? గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మోయలేని బరువులు మోస్తున్న చదువుకునే పిల్లల కష్టాలు వందవిధాలు. సర్కారు బడులు కాక ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే చిన్నారులకు ఆటలు పాటలు ల్లాంటివి ఏవీ ఉండవు. పైగా నిద్రలేచినప్పటి నుంచి పడుకునే దాకా కేవలం చదువుకోవడం రాయడం మినహాయంచి వారికి మరో ధ్యాస లేకుండా చేసే ఈ కొత్తబడులు వారి జీవనం గురించి ఆలోచిస్తే ఇది చాలా దారుణమని భావించరెందుకో? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262