శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అతిగ వాగేటి వారికే యగ్రపూజ
మితముగను మాటలాడిన మేలు గాంచఁ
బోరలీకాలమందున దారుణంబు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అతిదారుణమైన విషయమేమిటంటే అతిగా వాగే వాగుడు కాయలకే అర్హతను కట్టబెడుతున్నారు. మితంగా మాట్లాడేవారు పాపం ఎటువంటి ప్రయోజనాలు పొందకుంటున్నారంటే అంతకంటే ఘోరమింకేముంటుంది? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను అన్న వేమన్న సూక్తిని మరిచి ఈ జనులు గొప్పగా మాట్లాడేవారికే అన్నీ వచ్చుననుకొంటున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! కాస్త నీవైనా చూడవయ్య!
తే.గీ. తూనికల యందుఁ జూడంగఁ దూకమందు
మోసమరయంగ సరుకుల మూటలందు
నాణ్యతయుఁ గొరవచుండె నబ్బురముగఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: ధర్మం ఒంటి పాదం మీద నడుస్తున్న ఈ కాలంలో తూనిక రాళ్ల విషయంలోనూ అలాగే తూకం విషయంలోనూ పరిశీలిస్తే అంతా మోసమే రాజ్యమేలుతోంది. అలాగే సరుకులన్నిటి విషయంలోనూ నాణ్యత లోపమే. కలి ఉండే స్థానాలు తక్కువే కానీ ఆ స్థానాలే కలియుగంలో మిక్కుటమై పోయాయ. అందుకే ఎక్కడ చూసినా మోసమే కలిమాయ కనిపిస్తూనే ఉంది కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262