శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పతే.గీ. ప్రేమ పేరిట మోసాలు విస్తరించెఁ
గోరి కొనిఁ దెచ్చుకోనేల?కోటి కష్ట
ములను సోదరీ!మెలగుమీ మెలకువగనుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ కలికాలంలో ఎంతోమంది యువతులను ప్రేమపేరుతో నమ్మించి మోసాలు చేసేవారు పెచ్చుపెరిగిపోతున్నారు. అటువంటి మోసగాళ్ల మాయలో పడిఅనేక కష్టాలను కోరి తెచ్చుకుంటావెందుకు? సోదరీ !ఎప్పటికప్పుడు జాగారూకతను వహిస్తూ మెలగాలి అమ్మా! దుష్టశిక్షణ, శిష్టరక్షణ భారం వహించే కర్మసాక్షి వైన ఓ సూర్యదేవ చూడవయ్య.
తే.గీ. తానయన్నను తందాన తాన యనుచుఁ
బాపులనుఁ జేరి భజనతో వంతపాడు
వారు నిండిన జగతిలో ఁబ్రగతి సున్న
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఓ కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ కలియుగంలోవారిని చూడవయ్య. పాపపంకిలాన తిరిగే పాపాత్ముల చెంతచేరి తాన అంటే తందాన అంటూ వాళ్లు చేసే దుష్టకార్యాలకు, వాళ్ల దుర్భాషలకు వంతపాడే భజనపరులు తమ స్వప్రయోజనాల కోసం వారి చుట్టూతా చేరుతుంటారు. అలాంటివాళ్లతో నిండిన ఈ జగతిలో ప్రగతి ఏముంటుంది. అది ఎపుడూ సున్నగానే ఉంటోంది.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262