శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మాట దప్పుట పరిపాటి మాయలోక
మందు మాయమాటల ఁ జెప్పి మనుటయన్న
వెన్నతోఁ బెట్టు విద్యయుఁ గనె్న నిజము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం:- ఈ మాయలోకంలో మాట దప్పి ప్రవర్తించడం సహజాతి సహజమై పోయింది. అలాగే ఏవేవో మాయమాటలు చెప్పి మోసపోయే వారున్నంతకాలం మోసబుచ్చుతుండడం ఎంతో మందికి వెన్నతో పెట్టిన విద్య. అన్నది అక్షరాలా సత్యం. కర్మసాక్షివై ఓ సూర్యదేవ!చూడవయ్య.
తే.గీ. కడలినిఁ గూతురిగ నెంచుకొనక యత్త
మామలిర్వురు కూడని మాటలంచుఁ
బుట్టనింటిని దుమ్మెత్తి పోతురకట!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:- పుట్టినింటిని , పుట్టిన ఊరును విడిచిపెట్టి మెట్టినింటిలో కాలు పెట్టిన మహాలక్ష్మి వంటి కోడలిని కూతురిలా చూసుకోరు సరికదా ఎనె్నన్నో సూటిపోటి మాటలతో పాటు ఆడకూడని మాటలతో కోడలి పుట్టింటి వారిని గూర్చి దుమ్మెత్తిపోసే అత్తమామలు లేకపోతే లోకంలో ఎంత బాగుండు కదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా కాస్త చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262