జాతీయ వార్తలు

శ్రీనగర్ పర్యటనకు బయలుదేరిన విపక్ష బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకునేందుకు విపక్ష బృందం ఈరోజు బయలుదేరింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఇంకా పలువురు నేతలు బయలు దేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయని, ఒకవైపు కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ మరోవైపు అక్కడ పర్యటించటానికి ఎవ్వరినీ అనుమతించటం లేదని విమర్శించారు. అక్కడి నాయకులను ఇంకా గృహ నిర్బంధంలోనే ఉంచారని అన్నారు. ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ వాదన నిరాధారం అని అన్నారు. కాగా లోయలో శాంతిభద్రతల పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, ఈ నేపథ్యంలో విపక్షాల తాజా పర్యటన నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.