తెలంగాణ

నృసింహావతారంలో భద్రాద్రి రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 14: అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్‌పత్ ఉత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భక్తులకు నృసింహావతారంలో దర్శనమిచ్చారు.
స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నృసింహావతారంలో అలంకరించి ఆరాధన చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య బేలమండపం మీదు గా మిథిలా స్టేడియం వద్ద వేదికపైకి వచ్చి స్వామివారు దర్శనమిచ్చారు. అనంతరం తిరుమాడ వీధుల్లో విహరించి గోవిందరాజస్వామి ఆలయం లో పూజలందుకున్నారు.
గ్రామ పరిక్రమణ అనంతరం తిరి గి ఆలయానికి చేరారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీ కరించారు. జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి తీరంలో తెప్పోత్సవం వద్ద భక్తులకు కల్పించే సౌకర్యాలపై ఆరాతీశారు. తర్వాత ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

నృసింహావతారంలో రామయ్యను గర్భగుడి నుంచి తీసుకొస్తున్న అర్చకులు

ఐదుగురు
రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో రైతు మృతి
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్/మహబూబ్‌నగర్/నల్లగొండ/వరంగల్/డిసెంబర్ 14: ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఒక రైతు గుండెపోటుతో మరణించాడు. పత్తి పంట దిగుబడి రాక సాగుకోసం చేసిన అప్పులు తీర్చలేమన్న బెంగతో ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు పత్తి రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఆజ్మీరా రాజేంద్ర నాయక్ (45) అనే పత్తిరైతు తనకున్న నాలుగు ఎకరాల చేనులో పత్తిపంట వేయగా పంట సాగుకోసం చేసిన పెట్టుబడి రూ.5లక్షలు తీర్చేదారి లేక, పంట దిగుబడి చేతికి రాక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన రాయ పోచం (38) అనే పత్తి రైతు తన నాలుగు ఎకరాల సొంత పొలంలో పత్తి పంట వేయగా, వర్షాభావం, చీడపీడల బెడద కారణంగా పంట సాగుకు చేసిన పెట్టుబడి కూడా చేతికి అందలేదు. దీంతో జీవితంపై విరక్తిచెంది సోమవారం పురుగుల మందు తాగి రాజపోశం ఆత్మహత్య చేసుకున్నాడు. వాంకిడి మండలంలోని చిన్నవాంకిడి గ్రామానికి చెందిన గుర్నుల వార్లు (27) అనే యువరైతు ఆదివారం రాత్రి తెల్లవారు జామున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండల పరిధిలోని నాగల్‌కడ్మూర్ గ్రామంలో కృష్ణారెడ్డి (50) అనే రైతు తన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్లను పట్టుకొని మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన పందిరి వెంకటరెడ్డి (48) అనే కౌలు రైతు సోమవారం పురుగుల మందు తాగి పొలంలోనే అతత్మహత్యకు పాల్పడ్డారు. ఇతను నడిగూడెంలో 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగుచేశారు. ఇటీవల ధాన్యం నూర్పిడి చేయడంతో దిగుబడి తగ్గి, అప్పులు తీరలేదని మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి అత్మ హత్యకుపాల్పడినట్లు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామ శివారు వెంకటేశ్వరపల్లెకు చెందిన షేక్ అసీన్ (33) అనే రైతు అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదనకు గురైన గుండెపోటుతో మృతి చెందాడు.

ఖమ్మం మార్కెట్‌లో
నిలిచిన కొనుగోళ్లు
వ్యాపారులు, లారీ యజమానుల మధ్య వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 14: తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతు ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేశారు. దీనిపై రైతులు ఆందోళన బాట పట్టారు. ఖమ్మం లారీ యాజమాన్యం, వ్యాపారులకు మధ్య తలెత్తిన వివాదంతో మార్కెట్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తమ ఉత్పత్తుల విక్రయాల కోసం రైతులు ఆందోళనలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా సోమవారం లారీ యజమానులు, వ్యాపారులకు మధ్య నెలకొన్న వివాదం రైతులను ఇబ్బందులపాలు చేసింది. తమ లారీని పోలీసులు పట్టుకున్నారని, మరో రెండు లారీలను లారీ యజమానులే పట్టుకొని టైర్లను ధ్వంసం చేశారని మార్కెట్ వ్యాపారులు ఆరోపించారు. అన్ని ఆధారాలతో సరకును తీసుకెళ్తున్నా అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ఎలా తరలించాలని ప్రశ్నిస్తూ కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మార్కెట్, మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి చర్చల ద్వారా సర్దుబాటు చేశారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే మంగళవారం నుంచి కొనుగోళ్లు జరిపేది లేదని వ్యా పారులు స్పష్టం చేశారు. కాగా వ్యాపారులు, యజమానుల మధ్య వివాదం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని, అధికారులు కూడా వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారని రైతు సంఘాల నేతలు విమర్శించారు.

ధనిక రాష్ట్రంలో నెలకు
వంద మంది ఆత్మహత్యలా?

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ

పెద్దపల్లి, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్‌తో ఉంటుందని చెప్పి న సిఎం కెసిఆర్ పాలనలో నెలకు వందమంది వంతున ఇప్పటివరకు 2వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కరీంనగ ర్ జిల్లా పెద్దపల్లిలో టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు నాయకత్వంలో జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సొమవారం తలపెట్టిన ఒక్కరోజు దీక్షా కార్యక్రమానికి రమణ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుండగా అక్కడక్కడ మాత్ర మే కరవు మండలాలను ప్రకటించారన్నారు. జిల్లాలో ఊరూరా కరవుండగా కేవలం 19 కరవు మండలాలను గుర్తించి పెద్దపల్లి డివిజన్‌ను విస్మరించారన్నారు. కరవుతో అల్లాడుతున్న పెద్దపల్లి రైతులకు స్థానిక ఎమ్మెల్యే నయాపైసా కూడా సాయం అందించలేదన్నారు.