కృష్ణ

మేయర్ తీరుపై స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పార్టీ అధిష్టానానికి విన్నవించుకొంటామంటున్న సభ్యులు కాకు, నాగమణి, అనూరాధ
విజయవాడ, నవంబర్ 27: విఎంసి స్టాండింగ్ కమిటీ నిర్వహణలో అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ వ్యవహార శైలి ఆక్షేపనీయంగా ఉందంటూ పలువురు సభ్యులు ఆయనపై తిరుగుబాటు బావుట ఎగురవేసారు. కేవలం గంట వ్యవధిలోనే ముగించాలన్న తపన తప్పించి సమావేశంలో తమ వాదనను కూడా రికార్డు చేయాలన్న విషయాన్ని గుర్తించకపోవడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. మినీ కౌన్సిల్‌గా పిలవబడే స్టాండింగ్ కమిటీలో కీలక అంశాలున్నా వాటిపై సభ్యులతో చర్చించకుండానే తోపాటు సభ్యులకు చర్చకు అవకాశం ఇవ్వకుండానే తీర్మానం అయిపోందంటూ దాటవేస్తున్న వైనం వెనుక మతలబులేమిటని పలువురు స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్న వైనం చూస్తుంటే నగర మేయర్ శ్రీ్ధర్‌పై పాలక పక్షంలోనే వ్యతిరేకత నెలకొందన్న విషయం స్పష్టమవుతుండగా శుక్రవారం ఉదయం విఎంసి కౌన్సిల్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు కాకు మల్లికార్జునరావుతోపాటు ఇతర సభ్యులు కె అనూరాధ, ఎన్ నాగమణి లు తమ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కాకు మల్లికార్జున రావు మాట్లాడుతూ గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలో మేయర్ శ్రీ్ధర్ ప్రవర్తన హేయమన్నారు. హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ఆప్స్ మాడ్యూల్స్‌ను విఎంసిలో కూడా అమలుచేయాలన్న విషయం ఆహ్వానించదగినదే అయినప్పటికీ విఎంసి ఎంతో ఆర్ధిక లోటుతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆప్స్ పేరున వ్యయం చేస్తున్న లక్షలాది రూపాయలు వైఖరిని మాత్రమే తాము తప్పుపడుతున్నామన్నారు. అంతేకాక ఆప్స్ మాడ్యూల్స్ రూపకల్పనకై సాంకేతిక సంస్థలకు పిలిచిన టెండర్ ప్రక్రియలో కూడా అనేక లోపభూయిష్ట చర్యలున్నాయని, ప్రజా ప్రతినిధులు పాలకవర్గంగా ఉన్న తరుణంలో సాధారణ కౌన్సిల్‌కు కానీ, మినీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కానీ ఎటువంటి సమాచారం లేకుండానే అధికారుల కనుసన్నలలోనే ముందుగా అంతా నిర్ణయించేసి కేవలం పరిశీలనార్ధం అంటూ స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టడం కౌన్సిల్‌ను కించపర్చినట్టేనన్నారు. అలాగే టెండర్ ప్రక్రియపై అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం లేదని, ముందు నాలుగు సంస్థలు బహిరంగ టెండర్లలో పాల్గొన్నాయని చెప్పిన అధికారులు రికార్డులు తీసుకురమ్మనే సరికి కేవలం రెండు సంస్థల పేర్లతోనే వచ్చారని, ఇందులో మతలబు ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఎవరైన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మేయర్ అధికారులతో సమాధానం చెప్పించకుండా ఆయనే భుజాన వేసుకొని చెప్పుకొస్తున్న వైనం మరింత విడ్డూరంగా ఉందన్నారు. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణలపై పాలక పక్షంతోపాటు విపక్ష కార్పొరేటర్లలో కూడా మేయర్ శ్రీ్ధర్ తీరుపై తీవ్ర అభ్యంతరాలున్నాయని తెలిపారు. కౌన్సిల్‌లోనూ, నగర పాలక వ్యవహారాల్లోనూ మేయర్ శ్రీ్ధర్ అనుసరిస్తున్న వైఖరిపై తాము పార్టీ అధిష్టానంతోపాటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు బొండ ఉమమహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.