జాతీయ వార్తలు

ఎన్నాళ్లీ నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో మహిళలు ఇప్పటికీ జీవితంలోని అన్ని రంగాల్లో హింసను ఎదుర్కొంటూనే ఉన్నారని, తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే భావన ఒక్కటే పరిస్థితిలో మార్పు తీసుకువస్తుందే తప్ప శిక్షల తీవ్రత కాదని మహిళా హక్కులకోసం పోరాటం చేస్తున్న పలువురు ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి బుధవారానికి మూడేళ్లు పూర్తయంది. 2012 డిసెంబర్‌లో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయినప్పటికీ మహిళలు తమ ఇళ్లలో, బస్సులు, రైళ్లు లాంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో, పనిచేసే చోట.. ఇలా అన్నిచోట్లా హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలు, బాలికలపై ఎన్నో దాడులు జరిగాయి. వాటిలో కొన్నింటికి మీడియాలో భారీ ప్రచారం వచ్చింది. అయితే చాలా సంఘటనలు ప్రజల దృష్టికి దూరంగానే ఉంటున్నాయి అని అఖిల భారత ప్రగతిశీల మహిళా సతఘత కార్యదర్శి కవితా కృష్ణన్ అన్నారు. దేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా 2012 డిసెంబర్ నాటి నిర్భయ కేసుతోసహా అన్ని కేసుల్లోను న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందితో పాటుగా- ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా- తామూ ఆశతో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. శిక్ష ఏంత తీవ్రమైందన్నది కాక తప్పకుండా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలన్న డిమాండ్‌ను తాము పునరుద్ఘాటిస్తున్నామని కూడా ఆమె అన్నారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం 108 మంది మహిళా ఉద్యమ నేతలు, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు, ప్రగతిశీల నేతలు సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సంతకం చేసిన వారిలో కవితా కృష్ణన్ కూడా ఒకరు. మహిళలపై హింస అంశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం మరణ శిక్ష, బాల నేరస్థుల (జువనైల్) వయో పరిమితి తగ్గించడం లాంటి తిరోగమన విధానాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అయితే జస్టిస్ వర్మ కమిటీ జాగ్రత్తగా ఈ చర్యలను పరిశీలించి, ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వవని, బాధితుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవని తోసిపుచ్చిందని ఆ ప్రకటన పేర్కొంది.
నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన దరిమిలా 2012 డిసెంబర్‌లో జరిగిన ఉద్యమం తర్వాత లైంగిక దాడుల చట్టానికి తీసుకువచ్చిన సవరణల కింద నమోదైన కేసులను పరిశీలించినట్లయితే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని అర్థమవుతోంది. సమాజం విషయం అటుంచితే పోలీసులు, న్యాయ వ్యవస్థ, మీడియా, అధికారంలో ఉన్న రాజకీయ శక్తులు అందరు కూడా చాలావరకు చట్టాన్ని నీరుగార్చడానికే ప్రయత్నించారని కూడా ఆ ప్రకటనలో వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, నిర్భయ సంస్మరణార్థం గురువారం దేశ రాజధానిలో కొవ్వొత్తుల ప్రదర్శన, చిత్రకళా ప్రదర్శనలు లాంటి పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. జంతర్‌మంతర్ వద్ద బుధవారం పలు మహిళా సంఘాలు, పౌర సంఘాలు ‘నిర్భయ చేతనా దివస్’ను పాటించాయి.

నిర్భయ ఘటన జరిగి మూడేళ్లు పూర్తయన సందర్భంగా బుధవారం ఢిల్లీలో
నిర్వహించిన కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులతోపాటు వేదికపై
రాజ్యసభ సభ్యుడు జావేద్ అఖ్తర్, షబానా ఆజ్మీ, కిరణ్ బేడీ