తెలంగాణ

మెట్రో భూసేకరణ ప్రక్రియపై స్టేకు హైకోర్టు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భూసేకరణ ప్రక్రియ చేపట్టకుండా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. భూ సేకరణలో భాగంగా తమ భవనంలో కొంత భాగాన్ని సేకరించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా సంస్ధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ భవనం మొత్తం సేకరించాలని, అంతేకాని అందులో కొంత భాగం మాత్రమే తీసుకోవాలని ప్రతిపాదించడం తగదని పిటిషనర్ అభ్యర్ధించారు. కొంతమంది పలుకుబడి ఉన్న అధికారులు, పెద్దల కోసమే మెట్రో రైల్వే అధికారులు లైనును మార్చారని అరోపించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూసేకరణ ప్రక్రియపై స్టే ఇవ్వబోమని, ఈ ప్రక్రియను అడ్డుకునే హక్కు పిటిషనర్‌కు లేదని స్పష్టం చేసింది.
‘అన్‌ఫిట్’ డ్రైవర్లకు
అలవెన్సులు ఆపకూడదు
ఆర్టీసికి హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 13:అనారోగ్య కారణాల వల్ల ఆర్టీసి డ్రైవర్లను ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో నియమించినా వారికి వచ్చే అలవెన్సులు, జీతాలను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను జస్టిస్ పి నవీన్‌రావు జారీ చేశారు. డ్రైవర్‌గా ఫిట్ కాని వారిని శ్రామిక్ పోస్టుల్లో నియమిస్తున్నారని, కాని డ్రైవర్ వేతనాలు, అలవెన్సులు ఇవ్వడం లేదని పేర్కొంటూ కొందరు ఉద్యోగులు పిటిషన్ వేశారు. కాగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వైద్యపరంగా ఫిట్‌గా లేని డ్రైవర్లను ఆ పోస్టులో కొనసాగించడంలేదని ఆర్టీసి కోర్టుకు తెలిపింది. అలాంటివారిని రిటైరయ్యే వరకు ఇతర ఉద్యోగాల్లో కొనసాగించినా అలవెన్సులు ఇవ్వాలని, ఎనిమిది వారాల్లోగా ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది.