రాష్ట్రీయం

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లె, నవంబర్ 20: బంధువుల వివాహ మహోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ ఐదు నిమిషాల్లో గమ్యం చేరనున్న నేపథ్యంలో చిత్తూరు నుండి కుప్పంకు వెళ్తున్న బస్సును, బైరెడ్డిపల్లె గ్రామంలోకి వెళ్తున్న కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈరోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో మృతుల స్వగ్రామమైన మిట్టకురపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బైరెడ్డిపల్లె మండలం మిట్టకురపల్లెకు చెందిన వేణుగోపాల్ (25) బెంగళూరు కేంద్రంగా ట్రావెల్స్ నడుపుతున్నాడు. శుక్రవారం మండలంలోని తీర్థం గ్రామంలో తమ బంధువుల ఇంట జరగనున్న వివాహానికి తన తల్లి, పిన్నమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలసి హాజరైయ్యారు. ఉదయం ఆరు గంటలకు వివాహానికి హాజరై అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామమైన కురపల్లెకు బయలు దేరారు. ఇంటికి ఐదు నిమిషాల్లో చేరుకోనున్న నేపథ్యంలో మార్గమధ్యంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించని కారు నడుపుతున్న వేణుగోపాల్ వేగంగా బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న వేణుగోపాల్‌తో పాటు కారులో ఉన్న ఆయన తల్లి కళమ్మ(55), పిన్ని రమణమ్మ(45), రమణమ్మ కుమార్తె సుమిత్ర(25), ఆమె కూతురు మేనక(3) అక్కడికక్కడే మృతి చెందారు. కారు బస్సును ఢీకొన్న వేగానికి కారు వెనక భాగంలో కూర్చొని ఉన్న తల్లి కళమ్మ, పిన్ని రమణమ్మ, ఆమె కుమార్తె సుమిత్ర మృతదేహాలు గుర్తించడానికి వీలులేకుండా చిద్రమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పలమనేరు డిఎస్సీ శంకర్, సిఐ రవికుమార్, ఎస్సై కృష్ణమోహన్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అతి కష్టంమీద కారులో ఉన్న మృత దేహాలను స్థానికుల సహాయంతో వెలికి తీసి పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు బైరెడ్డిపల్లె ఎస్సై కృష్ణమోహన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కారు నడుపుతున్న వేణుగోపాల్ లిప్తకాలం పాటు కన్నుమూయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

చిత్రం.. ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారు