రాష్ట్రీయం

వెంటాడుతున్న విభజన కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను విభజన కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పంపకాల్లో ప్రతిష్టంభన వీడలేదు. విభజన జరిగి 21 నెలలు కావస్తున్నా, ఇంకా ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకం జరగకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం షెడ్యూల్ 9లో ప్రభుత్వ రంగ సంస్ధలను చేర్చారు. ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, ఉద్యోగుల విభజనపై షీలాబేడీ కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ కాలపరిమితి గత ఏడాది ఆగస్టుతో ముగిసింది. షీలాబేడీ కమిటీని కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 జూన్‌లో నియమించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్ధల నుంచి ఆంధ్రా స్ధానికత పేరుతో 1253 మంది ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఈ ఉద్యోగుల వ్యవహారంపై ఆగ్రహం చెందిన ఆంధ్రప్రభుత్వం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదుచేసింది.
ఈ నేపథ్యంలో షీలాబేడీ కమిటీ కాలపరిమితి ముగిసినా ఇంకా పొడిగిస్తూ కేంద్రం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. 65 ప్రభుత్వ రంగ సంస్ధలకు సంబంధించి ఆస్తులు, అప్పుల చిట్టాను ఈ కమిటీ ఖరారు చేసింది. కాని రెండు రాష్ట్రప్రభుత్వాలు వీటిని ఇంకా ఆమోదించలేదు. ఉద్యోగుల పంపకం కూడా పెండింగ్‌లో ఉండిపోయింది. షీలాబేడీ కమిటీకి కేవలం ఆస్తులు, అప్పుల పంపకం బాధ్యతను మాత్రమే అప్పగించారు. ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని గతంలోనే ఈ కమిటీ రెండు రాష్ట్రప్రభుత్వాలకు స్పష్టం చేసింది. కమల్ నాథన్ కమిటీ కూడా ప్రభుత్వ రంగ సంస్ధ ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని స్పష్టం చేయడం గమనార్హం. ఆప్కో సంస్ధ విభజన లెక్కలు తేలకపోవడంతో సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి వంద కోట్లు, జాతీయ సహకార అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.145 కోట్ల రుణం తీసుకుంది. ఈ రెండు బ్యాంకులకు ఆప్కో వడ్డీలను చెల్లించాల్సి ఉంది. ఆప్కో ఆడిట్ లెక్కలు కూడా పూర్తి కాలేదు. దీంతో రెండు రాష్ట్రప్రభుత్వాలు కూడా చేనేత సంక్షేమంతో పాటు, బ్యాంకులకు చెల్లించే వడ్డీ నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నట్లు ఆప్కో వర్గాలు తెలిపాయి. ఆప్కోకు తెలంగాణ ప్రభుత్వం రూ.130 కోట్లు, ఆంధ్రప్రభుత్వం రూ.120 కోట్లను చెల్లించాల్సి ఉంది. షీలాబేడీ కమిటీ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, అప్పుల వివరాలను తేల్చడమే కాకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే దాకా కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి తెలిపారు.
ఆర్టీసి పరిస్ధితి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పరిపాలనా సౌలభ్యంతో రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి బస్సుల నిర్వహణ వరకు విభజన ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. కాని ఆస్తులు, అప్పుల లెక్కలపై అధికార ముద్రలేదు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చే వరకు సాంకేతికంగా ఆర్టీసి విభజన కానట్లేనని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి.

టిడిపిలో చేరే ప్రసక్తే లేదు
వైకాపా ఎమ్మెల్యేల స్పష్టీకరణ
పుంగనూరు, ఫిబ్రవరి 21: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలెవరూ చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మి టిడిపి వైపు మొగ్గుచూపాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మల్లుపల్లె గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. టిడిపి మునిగిపోయే నావలాంటిదని, దానిలో చేరి నష్టపోవాలని ఎవరూ అనుకోరని అన్నారు. ఇప్పటికే అలవిగాని హామీలు గుప్పించి, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ పార్టీ ప్రజల విశ్వాసం ఎప్పుడో కోల్పోయిందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు అంటూ శాసనసభ్యులను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి కెసిఆర్‌తో రాజీ కుదుర్చుకుని నేడు అదేవిధంగా ఇక్కడ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. డబ్బు, అధికార దర్పంతో ఏదైనా చెల్లుబాటు అవుతుందనుకుంటే ప్రతిఘటన ఎదుర్కోక తప్పదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవినీతితో సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రజల దృష్టిలో చులకన అయ్యారన్నారు. అవినీతిలో దేశంలోనే ప్రథమ ముఖ్యమంత్రిగా పేరుమోసిన చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వ్యాఖ్యానించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపులు, వెన్నుపోట్లు బాబుకు కొత్త కాదన్నారు. గతంలో మామను, రాజకీయ భవిష్యత్తునిచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ దళితులను చులకన చేస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తే ఎవరూ వెళ్లే స్థితిలో లేరని వారు స్పష్టం చేశారు.