రాష్ట్రీయం

ఐదుగురూ నిర్దోషులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీదులో పదకొండేళ్ల కిందటి సంచలన బాంబు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ భాయ్, రాజేందర్ చౌదరిలను నిర్దోషులుగా పేర్కొంటూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 11ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన పేలుళ్ల కేసులో పదిమందిని ఎన్‌ఐఏ నిందితులుగా పేర్కొంది. నిందితుల్లో ఒకరు చనిపోయారు. మరో నలుగురిపై విచారణ కొనసాగుతోంది. కాగా ఐదుగురిపై చార్జిషీట్లు దాఖలుకాగా, నమోదైన నేరాభియోగాలకు సరైన ఆధారాలను ప్రాసిక్యూషన్ అందించలేకపోవడంతో కేసు కొట్టివేస్తున్నట్టు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషి కేసు విచారణలో ఉండగానే హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు నిందితులు ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ సందీప్ వి డాంగే, ఆరెస్సెస్ కార్యకర్త రామ్‌చంద్ర కల్‌సాంగ్రా పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్‌మార్, అమిత్ చౌహాన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నలుగురిపై చార్జిషీట్ కొనసాగుతుందని న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి తీర్పులో స్పష్టం చేశారు. 2007 మే 18న చోటుచేసుకున్న పేలుళ్ల కేసులో ఐదుగురి నిందితులపై ప్రత్యేక న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందోనని యావత్ దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూశారు. సోమవారం కేసు బెంచ్‌కు రాగానే నిందితులను కోర్టు హాల్లో ప్రవేశపెట్టారు. వారి సమక్షంలోనే కేవలం ఐదు నిమిషాల్లో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నేరారోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులపై ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించ లేకపోయిందని, నేరారోపణలు రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా భావిస్తూ కేసు కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించడం సంచలనం రేకిత్తించింది. ఐదుగురు నిందితుల్లో ఏ ఒక్కరినీ బోనులో నిలబెట్టేందుకు ఎన్‌ఐఏ సరైన ప్రయత్నం చేయలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలతోపాటు 226మంది సాక్ష్యులను సైతం విచారించి, వారి వాంగ్మూలాలతోపాటు 411 పేజీల డాక్యుమెంట్లను సైతం కోర్టుకు ఎన్‌ఐఏ సమర్పించింది. అయినప్పటికీ కేసులో ఒక్కరిపైనా నేరారోపణ రుజువు కాకపోవడంతో మొత్తం కేసు నీరుగార్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రత్యేక కోర్టు తీర్పు పూర్తిగా సమీక్షించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. తీర్పు కాపీ ఇంకా తమ చేతికి అందలేదని, వచ్చిన తర్వాత పూర్తిగా పరిశీలించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. కాగా ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకుని, వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన దారుణ ఘటనలో నిందితులను కోర్టు కఠినంగా శిక్షిస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పేలుళ్లలో ఐదుగురు చనిపోగా, అనంతరం జరిగిన అల్లర్లు, హింసను నియంత్రించే క్రమంలో పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందడం తెలిసిందే. సుమారు 58మంది వరకూ అల్లర్లలో గాయపడ్డారు. ఈ ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్‌ఐ ఉగ్రవాదులేనని ఉమ్మడి ఏపీ పోలీసులు మొదట్లో భావించారు. హాజీ కమాండర్ షాహిద్ బిలాల్ బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి వ్యూహరచన చేసి ఘాతుకానికి పాల్పడినట్టు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఐఎస్‌ఐ సానుభూతిపరులు, వారితో లింకులున్నట్టు అనుమానించి సుమారు 100మంది అమాయక ముస్లిం యువకులను కొనేళ్లపాటు వేధించారు. కొందరిని విచారించి వదిలివేయగా, మరికొందరిపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లు దాఖలు చేశారు. తర్వాత సిబిఐ విచారణ, మళ్లీ ఎన్‌ఐఏ చేతికి కేసు వచ్చింది. అప్పటి నుంచి ఎన్‌ఐఏ దర్యాప్తు కీలకంగా మారింది.