రాష్ట్రీయం

స్తంభించిన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర బంద్ సక్సెస్ అయింది. వ్యాపారులు తమంతట తాముగా స్వచ్ఛందంగా దుకాణాలు, షోరూంలు మూసి రోడ్డెక్కారు. రాజధాని ప్రాంత విజయవాడ నగరంలో బంద్ విజయవంతమైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని చోట్లా బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి, తదితర ప్రాంతాల్లో వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, వైకాపా పార్టీలతో పాటు అనేక ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు బంద్ విజయవంతం కావటంలో కీలకపాత్ర పోషించాయి. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఏ వీధిలో చూసినా ర్యాలీలే
సాక్షాత్కరించాయి. ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తగా జెండాలు రెపరెపలాడాయి. విజయవాడలో లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు నేతృత్వంలో లారీ యజమానులు తమ తమ లారీలను నిలిపివేసి ర్యాలీ నిర్వహించారు. దాంతో లారీలు రోడ్డెక్కలేదు. దీనికితోడు జాతీయ రహదారులపై ఆందోళనకారులు ఎక్కడి లారీలను అక్కడ నిలిపి వేశారు. ఇక ఉదయం ఐదు గంటల ప్రాంతానికే సీపీఐ, సీపీఎం, వైకాపా నేతలు, వందలాది కార్యకర్తలు పలు మార్గాల నుంచి ర్యాలీలుగా పండిట్ నెహ్రూ బస్టేషన్‌ను చుట్టుముట్టి ఏ ఒక్క బస్సు రోడ్డెక్కకుండా నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. బందరు రోడ్డులో ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పాతబస్తీలోని వస్తల్రత, కాళేశ్వరరావు మార్కెట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్లు పూర్తిగా మూతబడ్డాయి. సినిమా హాళ్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూసివేయించారు. విద్యాసంస్థలకు యాజమాన్యాలే సెలవు ప్రకటించాయి. భోజన హోటళ్లు, మెస్‌లు మూతబడ్డాయి. బంద్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నేతృత్వంలో అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటైంది. బంద్ ప్రశాంతంగా ముగిసింది.