రాష్ట్రీయం

ఆవిర్భావ సభను అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నిర్వహణకు హైకోర్టు సోమవారం అనుమతినిచ్చింది. సరూర్‌నగర్ గ్రౌండ్‌లో తెలంగాణ జన సమితి (తెజస) 29న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమంటూ అటు పోలీసు శాఖ, ఇటు సరూర్‌నగర్ మైదానం నిర్వాహకులు నిరాకరించారు. దీంతో తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సభకు మూడు రోజుల్లోగా అనుమతి మంజూరు చేయాలని కోర్టు పేర్కొంది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ కొత్తగా ఏర్పాటు కానుంది. ఈ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం. ఒకొక్కరూ పదిమందితో సభకు తరలిరావాలి అని కోదండరామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.