రాష్ట్రీయం

న్యాయమూర్తి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నాలుగో కోర్టు న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. మక్కా మసీదు పేలుడు కేసు తీర్పును సోమవారం ప్రకటించగా, సాయంత్రం పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2007 మే 18న హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడంపై చర్చ మొదలైంది. తీర్పునకు సంబంధించిన అంశాలు కానీ, విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలు కానీ ఏమైనా ఆయనపై ప్రభావం చూపాయా? అని న్యాయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. రవీందర్‌రెడ్డి కరీంనగర్ జిల్లా వాసి. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణలో జడ్జీలుగా నియమించవద్దని తెలంగాణకు చెందిన 11మంది న్యాయమూర్తులు ఆందోళన చేశారు. ఆ సమయంలో సస్పెండైన 11మందిలో రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. మరోవైపు తెలంగాణ న్యాయాధికారుల సంఘంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల ఒక న్యాయవాది ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు చేశారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఆయన తన రాజీమానాపై స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. ఆయన రాజీనామాకు దారితీసిన నిర్ధిష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని జాతీయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రధాన అంశంగా చర్చ సాగింది. మరోపక్క తీవ్ర మనోవ్యధతో న్యాయమూర్తి బాధపడుతున్నారన్న వాదనా ప్రచారంలో ఉంది.