తెలంగాణ

సియాచిన్ నుంచి బలగాలను ఉపసంహరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో రాజీధోరణి సరికాదని రక్షణ రంగ నిపుణుడు, బ్రిగేడియర్ రిటైర్డ్ ఏజి కృష్ణయ్య పేర్కొన్నారు. సియాచిన్‌పై భారత హక్కులను పొరుగు దేశాలు గుర్తించే వరకు భద్రతను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం అవేర్‌నెస్ ఇన్ ఆక్సన్ సంస్థ ఆధ్వర్యంలో ఓయు లైబ్రరీ ఐసిఎస్‌ఎస్‌ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండియాస్ సెక్యూరిటీ ఇంపరేటివ్స్ అండ్ సియాచిన్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. సదస్సుకు హాజరైన బ్రిగేడియర్ కృష్ణయ్య మాట్లాడుతూ శాంతిప్రవచనాలు చేస్తున్న పాకిస్తాన్ 1984లో సియాచిన్ లాంటి భారత భూభాగంలో చొరబడిన అంశాలను, అదేవిధంగా కార్గిల్‌లో చొచ్చుకు వచ్చిన అంశాలను గుర్తుచేశారు. దేశ భద్రతలో అత్యంత ముఖ్యమైన సియాచిన్ నుంచి బలగాలను తొలగించాల్సి వస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. చైనా, పాకిస్తాన్ సేనలు ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని అదనుకోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో పూర్తిగా అనువుగాలేని వాతావరణంలో సైనికులు దేశం కోసం అసువులు బాస్తున్నప్పటికీ రక్షణ అత్యవసరమని పేర్కొన్నారు. మంచుకొండల్లో, మైనస్ నలభై డిగ్రీల వాతావరణంలో నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి అటు శుత్రువులతో ఇటు ప్రమాదకర పరిస్థితుతో మన జవాన్లు నిరుపమానమైన త్యాగాలను చేస్తున్నారని, వారి త్యాగాల ఫలితంగానే దేశం సురక్షితంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో చైనా తన పాటవాన్ని మరింతగా పెంచుకుంటోందని, దీని ఫలితంగా జమ్ముకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతానికి, ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనా నుంచి ముప్పు పెరుగుతోందని అన్నారు. భారతదేశం తన సైనిక పాటవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో వ్యూహాత్మక ఎత్తుగడల విషయంలో దృఢమైన వైఖరిని అవలంబిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ విషయంలో ఆయన సృష్టమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారని బ్రిగేడియర్ కితాబిచ్చారు.
రక్షణ రంగ నిపుణుడు మయాంక్ సింగ్ మాట్లాడుతూ సియాచిన్ మంచుకొండల్లో ఉన్న అత్యంత భీతావహ పరిస్థితుల గురించి వివరించారు. భారతదేశానికి నిరుపమాన త్యాగాలను చేస్తున్న సైనికులను ఎప్పటికీ మర్చిపోరాదని తెలిపారు. భారత దేశం ఒకే సమయంలో రెండున్నర యుద్ధాలను చేస్తోందని, ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాతోపాటు నక్సల్స్ ఉగ్రవాదం వంటి అంతర్గత శక్తులతో పోరాడుతోందని అన్నారు. సాధారణ ప్రజలకు దేశ రక్షణ, భద్రతల విషయం మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. నెహ్రూ యువక్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు మాట్లాడుతూ సియాచిన్ నుంచి భారత్ వైదొలగాలని వాదించే వారికి అక్కడి పరిస్థితులపై అవగాహన లేదని అన్నారు. సియాచిన్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించి అక్కడి ఆపరేషన్ మేఘదూత్ నిర్వహించి ఇందిరాగాంధీ సైనాన్ని పంపించారనీ, కానీ ఆమె మనవడు రాహుల్‌గాంధీ ఈనాడు దేశద్రోహశక్తులకు వత్తాసు పలకడం దారుణమని అన్నారు.
కల్నల్ మోహన్‌కుమార్ మాట్లాడుతూ భారత సైనికుల త్యాగాలకు ధైర్యసాహసాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. గతంలో పాలకుల తప్పిదాలకు ఏకపక్ష నిర్ణయాలకు ఎదుటివారిని అంచనా వేయడంలో చేసిన పొరపాట్ల కారణంగా నేటికీ మూల్యం చెల్లిస్తున్నామని అన్నారు. సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్‌రావు, యాంటీ టెర్రరిజం ఫోర్స్ వ్యవస్థాపకుడు రావినూతల శశిధర్ ప్రసంగించారు. సదస్సు ప్రారంభానికి ముందు సియాచిన్‌లో అమరులైన పదిమంది వీర జవాన్లకు సభ ఘనంగా నివాళి అర్పించారు.