ఆంధ్రప్రదేశ్‌

టెండర్లు ఎక్కువైతే లాటరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఇసుక ఇ వేలం విధానంలో కొత్తగా సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుండి మలి దశ జరగనున్న ఇసుక రీచ్‌ల వేలం ప్రక్రియను సవరించిన విధానాల ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. కొత్తగా సవరించిన విధానం ప్రకారం ఇ వేలంలో పాల్గొనే బిడ్డర్లు ఎక్కువ మంది ఒకే ధరను కోట్ చేసిన పక్షంలో లాటరీ ద్వారా టెండరును ఖరారుచేయాల్సి ఉంటుంది. ఇ వేలంలో ఒకే ధరను ఎక్కువ మంది కోట్ చేసేందుకు వీలుండదు. కానీ ఒకే ధరతో ఎక్కువ మంది ఇ టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఇ టెండర్లను తెరిచినపుడు ఎక్కువ మంది ఒకే ధరను కోట్ చేసి ఉంటే, అలాంటి టెండర్లను లాటరీ ద్వారా ఖరారుచేస్తారు. క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు మించి అమ్మకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ఇసుక అమ్మకం ధర కన్నా ఎక్కువ వేలం ధర ఇ వేలంలో ఎవరూ కోట్ చేయకుండా ఈసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తొలి దఫా జరిగిన ఇ వేలం ప్రక్రియలో బిడ్డర్లు క్యూబిక్ మీటరు ఇసుకకు ఎంతయినా సరే ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకొస్తే, అలాంటి వేలం ధరను ఇ వేలంలో కంప్యూటర్ తీసుకునేది. క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు మించి అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయిస్తే, క్యూబిక్ మీటరు ఇసుకకు ప్రభుత్వానికి రూ.2222 చెల్లించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని జొన్నాడ ఇసుక రీచ్ వేలంలో బిడ్డర్లు వేలం ధరను కోట్ చేసిన సంగతి విదితమే. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వేలం ధర. ఈసారి అలాంటి అధిక వేలం ధరను కోట్ చేసేందుకు అవకాశం లేకుండా చేస్తూ క్యూబిక్ మీటరు ఇసుక వేలం ధరను రూ.498కు మించి ఎవరూ కోట్ చేసేందుకు వీలు లేకుండా ఇ వేలంను నిర్వహిస్తున్న ఎంఎస్‌టిసి వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. అందువల్ల క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.498కు మించి ఎవరైనా దాఖలుచేసేందుకు ప్రయత్నిస్తే, కంప్యూటరే తిరస్కరిస్తుంది. వాస్తవానికి ఇది కూడా తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.498 రాష్ట్రప్రభుత్వానికి చెల్లించేందుకు టెండరు దాఖలుచేసిన వారికి రీచ్‌ను అప్పగిస్తే, క్యూబిక్ మీటరు ఇసుకను తవ్వి అమ్మకానికి సిద్ధం చేసేందుకు బిడ్డరుకు సుమారు రూ.668ఖర్చవుతుంది. క్యూబిక్ మీటరు ఇసుకకు సీనరేజిగా రూ.50, ఆదాయపన్నుగా 2శాతం, వాణిజ్య పన్నుగా 5శాతం, మినరల్ ట్రస్టు ఫండ్, రీచ్ నిర్వహణ తదితర ఖర్చులు కలిపి రీచ్‌కు సగటున రూ.170 ఖర్చవుతుంది. అలాంటపుడు క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు బిడ్డరు ఎలా అమ్మగలుగుతాడనేదే ఇపుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న. తొలి దఫా వేలంలో క్యూబిక్ మీటరుకు రూ.2వేలు కోట్ చేసిన బిడ్డరు ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుందో, సవరణల తరువాత రూ.498 వేలం ధరకు రీచ్‌ను దక్కించుకున్న బిడ్డరు కూడా అదే తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది. పోనీ గనులశాఖ యంత్రాంగం గట్టి నిఘా పెట్టి అక్రమాలను అదుపుచేస్తుందా అంటే, గనులశాఖలో నామమాత్రపు సిబ్బందే ఉన్నారు. అందువల్ల బిడ్డర్లు పగలు రూ.500కు, రాత్రి రూ.1000కి ఇసుకను అమ్మినా ఎవరూ అదుపుచేయలేరు. ఒక రకంగా రాష్ట్రప్రభుత్వమే బిడ్డర్లు తప్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గరిష్ఠ వేలం ధరను రూ.230 నుండి రూ.250 మధ్య రీచ్‌లను బట్టి నిర్ణయించి వేలం నిర్వహిస్తే బావుండేదని అంతా అభిప్రాయపడుతున్నారు. తాజా సవరణల ప్రకారం కనిష్ఠ వేలం ధరను రూ.125గా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సవరణల గందరగోళం
ఇసుక విధానంపై స్థిరమైన నిర్ణయాలు, స్పష్టమైన అవగాహన లేని ప్రభుత్వం రోజుకో సవరణతో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. జనవరి 15న సంక్రాంతి రోజు కొత్త ఇసుక విధానాన్ని జారీచేసిన తరువాత రకరకాల ఇసుక సవరణలు చేయటం చూస్తుంటే, రాష్ట్రప్రభుత్వం ఎంత అయోమయంగా ఉందో అర్ధమవుతోంది.

కెజి బేసిన్ రీజనల్ ఆఫీసు
కాకినాడలోఏర్పాటు చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 21: కోస్తాలో చమురు, సహజవాయు సంస్థలకు కేంద్రంగా ఉన్న కాకినాడ తీరంలో కెజి బేసిన్ ప్రాంతీయ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యాలయాన్ని కాకినాడలోనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో దీనిని ఏర్పాటు చేసేందుకు ఒఎన్‌జిసి ప్రయత్నిస్తుండటంతో తక్షణం ఆ ప్రతిపాదన విరమించుకోవాలని కాకినాడ ఎంపి, లోక్‌సభలో టిడిపి ఫ్లోర్‌లీడర్ తోట నరసింహం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుమారు 282 కోట్ల రూపాయల విలువ గల ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తే కోస్తా తీర ప్రాంతానికి తీరని తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను కలిసి కాకినాడ కేంద్రంగా కెజి బేసిన్ ప్రాంతీయ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్టు నరసింహం చెప్పారు. కాకినాడలో కెజి బేసిన్ ప్రాంతీయ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలన్న డిమాండ్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఉంది. విపత్తు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడ కాకినాడలో ఏర్పాటుచేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీస్తున్న కార్పొరేట్ సంస్థలకు కాకినాడ కేంద్రంగా ఉంది. ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా, గెయిల్, జిఎస్‌పిసి (గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ)తో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో లక్షల కోట్ల వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకినాడ తీరంలో చమురు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కెజి బేసిన్ ప్రాంతీయ కార్పొరేట్ కార్యాలయాన్ని కాకినాడలో ఏర్పాటుచేస్తేనే ఈ ప్రాంతానికి న్యాయం చేసినట్టవుతుందని కేంద్రమంత్రికి ఎంపి నరసింహం విజ్ఞప్తి చేశారు.
పెట్రో వర్సిటీ నేర్పిన గుణపాఠం!
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పెట్రోలియం విశ్వ విద్యాలయం ఇప్పటికే విశాఖ జిల్లాకు తరలిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కెజి బేసిన్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కాకినాడలోనే పెట్రో వర్సిటీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. అయితే ఈ జిల్లా యంత్రాంగం సకాలంలో తగిన స్థలాన్ని పెట్రో వర్సిటీ కోసం ఎంపిక చేయడంలో విఫలమైంది. ఈ విషయంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపిలు శ్రద్ధ వహించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకరి బాటలో మరొకరు!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పలు అంశాల్లో పరస్పరం విమర్శించుకుంటున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఒకరినొకరు అనుసరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తరహానే అనుసరిస్తున్నారు. కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి పథకాల్లో, అంగన్‌వాడీ వర్కర్లకు జీతాల పెంపు, ఇంటింటి సర్వే వంటి అంశాల్లో కెసిఆర్‌ను చంద్రబాబు అనుసరిస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టగా, ఆంధ్రలోనూ అమ్మాయి వివాహానికి 50వేల రూపాయలు చెల్లించే పథకానికి శ్రీకారం చుడుతున్నారు. డబుల్ బెడ్‌రూమ్ పథకంపై సైతం ఆలోచన చేస్తున్నారు. పదవుల పంపకంలో మాత్రం కెసిఆర్ చంద్రబాబు మోడల్‌నే అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకూ నామినేటెడ్ పదవుల పంపకం జరపలేదు. బాబు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల పంపకంపై నేడో రేపో పదవుల పంపకం అంటూ అనేకమార్లు వార్తలు లీక్ చేయించేవారు. అలా ఏళ్ళు గడిచిపోయేవి. తెలంగాణ విషయానికొస్తే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఏప్రిల్ వరకు నామినేటెడ్ పదవుల పంపకానికి అవకాశం లేదు. గత సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పదవుల పంపకంపై చర్చ జరిపారు. ఆ తరువాత పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనూ పదవుల పంపకం మాట వినిపించింది. దసరాకు పదవుల పంపకం అని పార్టీ సమావేశంలో స్వయంగా సిఎం ప్రకటించారు. కానీ ఆచరణలో జరిగింది శూన్యమే. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు తొలిసారిగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

టీచర్ ఇంట్లో చోరీ
కదిరిటౌన్, ఫిబ్రవరి 21 : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని దేవళం బజారులో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బాలాజీప్రసాద్ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. బాలాజీప్రసాద్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మదనపల్లిలోని తన సోదరి కుమార్తె శుభకార్యానికి వెళ్లాడు. ఇది పసిగట్టిన దొంగలు రాత్రి ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి అందులో దాచి ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులతో పాటు రూ. 2.75 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు ఆదివారం ఉదయం బాలాజీప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కదిరి పట్టణ సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ విజయకుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అలాగే అనంతపురం నుంచి క్లూస్‌టీం, వేలిముద్రల నిపుణులు ఇక్కడికి ఆధారాలను సేకరించారు.