ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురి జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖాపట్నం: బ్రెయిన్ డెడ్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థి అవయవ దానం చేసి ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపారు. అవయవదాన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ ఘటన విశాఖలో జరిగింది. అతని కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో 19 ఏళ్ల సాయికుమార్ బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మోటార్ బైక్ నడుపుతూ ఈ నె 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం విశాఖలోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య సేవలు అందిస్తున్న బృందం బ్రెయిన్ డెడ్ అయినట్లుగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ సభ్యులు కుమార్ కుటుంబ సభ్యులతో ఆదివారం మాట్లాడారు. అవయవ దానం చేయడం వల్ల మరికొందరి జీవితాల్లో వెలుగు నింపవచ్చని వివరించారు. కుమారుడు మృతి చెందినా, అతని అవయవాలతో మరి కొందరు జీవించడాన్ని చూడవచ్చని చెప్పడంతో అంగీకరించారు. ఈ మేరకు జీవన్‌దాన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రాజెక్టు ప్రతినిధులకు తెలిపారు. కుమార్ కిడ్నీ, లివర్‌ను నిబంధనల మేరకు ముగ్గురికి నగరంలోని ఆసుప్రతుల్లో విజయవంతంగా అమర్చారు. గుండె, ఊపిరితిత్తులను కూడా చెన్నై తరలించి అవసరమైన రోగులకు అమర్చేందుకు ఒక వైద్య బృందం వచ్చింది. కానీ సాంకేతిక కారణాలతో ఇతరులకు అమర్చేందుకు సాధ్యపడలేదని డాక్టర్ సాయిపాల్ తెలిపారు.