రాష్ట్రీయం

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ గురువారం జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అసలు రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదాపై దేశవ్యాప్త చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాపై నగరంలో సీఎం
బాబు 12 గంటల దీక్ష జరుగుతుండగా మరోవైపు జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణాజిల్లాలో యధావిధిగా కొనసాగబోతున్నది. గురువారం నూజివీడు నియోజకవర్గంలో శోభనాపురం శివారు నుంచి 140వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. వేలాదిమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేశారు.
ధర్మ పోరాట దీక్షకు అమరావతి జేఏసీ మద్దతు
ప్రత్యేక హోదాకై సీఎం చంద్రబాబు శుక్రవారం చేపట్టబోయే ధర్మ పోరాట దీక్షకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కో చైర్మన్ డిఎస్ కొండయ్య, సెక్రటరీ జనరల్ టివి ఫణి పేర్రాజు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. బాబు దీక్షలో నాయకులు, ఉద్యోగులు అందరూ పాల్గొంటారని అన్నారు. తాము ఇప్పటికే గత నెల 28 తేదీ నుంచి ఈనెల ఆరో తేదీ వరకు రాష్టవ్య్రాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.