రాష్ట్రీయం

రైతు కోసం పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయి, వారికి ఏదైనా మేలు తన వంతుగా చేసేందుకు ఒక యువకుడు నడుంబిగించాడు. రైతన్న సమస్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు రైతు కోసం పరుగు అనే పేరుతో పరిగెత్తే కార్యక్రమం చేపట్టాడు. మండుటెండను సైతం లెక్కచేయకుండా హైదరాబాద్ నుంచి వెలగపూడి సచివాలయానికి రోజుకు దాదాపు 60 కిలోమేటర్ల మేర పరుగెత్తుతూ, గురువారం విజయవాడ చేరుకున్నారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రైతుల సమస్యలను వివరించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన వెంకట పణీంద్ర కుమార్ రైతుకు తన వంతుగా మేలు చేసేందుకు ఈ పరుగును చేపట్టారు. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి ఏపీ సచివాలయం వరకూ పరుగును ఈ నెల 14న ప్రారంభించి, గురువారం ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఇంజనీరింగ్ పట్ట్భద్రుడైన 28 సంవత్సరాల ఫణీంద్ర తాను చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి, రైతు కోసం పరుగు నిర్వహించారు. రాష్ట్రాలు విడిపోయినా, రైతులు విడిపోలేదని తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ రైతులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడను ఫణీంద్ర తన తండ్రి నాగరాజుతో కలిసి కలుసుకున్నారు. తన పరుగు లక్ష్యాలను సీఎంకు వివరించారు. రైతులకు తగిన న్యాయం చేసేందుకు చర్యలు చేపటాటలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కరవు రహిత రాష్ట్రం, లాభాసాటి వ్యవసాయం, ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. కేంద్రం సహకరించకున్నా, తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. మిర్చిపంటకు ధర లభించని సమయంలో మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించి మిర్చిని కొనుగోలు చేసిందన్నారు. తన యాత్ర అనుభవాలను వివరించి, మినుము రైతును ఆదుకోవాలని కోరారు.

చిత్రం..ఫణీంద్రను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు