రాష్ట్రీయం

హైదరాబాద్ పోలీసుల సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు భేష్ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. నగరవాసులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న సేవలను అభినందించారు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రికార్టు సృష్టించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను విజయన్ గురువారం సందర్శించారు. అనంతరం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను సందర్శించారు. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే విధానం చాలా బాగుందని అన్నారు. ఇంకా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ మానిటరింగ్ విభాగాన్ని కూడా సీఎం విజయన్ పరిశీలించారు. ప్రత్యేకించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పని చేస్తున్న వారందరినీ సీఎం అభినందించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆ స్టేషన్‌లో జరుగుతున్న పనితీరు, రెండో ఉత్తమ స్టేషన్‌గా అవార్డు అందుకున్న కారణాలను వివరించారు. అనంతరం హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన టీఎస్ కాప్, హవక్ ఐ మొబైల్ అప్లికేషన్ ఆధారిత సేవలు విజయవంతమైన తీరును డీజీపీ మహేందర్‌రెడ్డి కేరళ సీఎంకు వివరించారు. నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలు పసిగట్టడం, క్షణాల్లో సమాచారం స్వీకరించడం వంటి వాటి కోసం యాప్ ఆధారిత సేవలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని డీజీపీ వివరించారు. పారదర్శక పోలీసింగ్ విధానాన్ని వీటిద్వారా అమల్లోకి తెచ్చామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వీటి సేవలను విస్తరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరు గురించి కూడా వివరించారు. అనంతరం విజయన్ మాట్లాడుతూ ఇక్కడ అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు, పనితీరు గురించి అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపిస్తామని తెలిపారు. ఇదే తరహా విధానం కేరళలో కూడా అమలు చేస్తామని చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరు గురించి
తెలుసుకుంటున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్