రాష్ట్రీయం

రాజకీయ తీర్మానంపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: సీపీఎం జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం రగడ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ మెజారిటీ సభ్యుల ఆమోదంతో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో సీతారాం ఏచూరి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉండగా కారత్ ప్రవేశపెట్టారు. జాతీయస్థాయి పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీతారాం ఏచూరి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తేనే మతతత్వ బీజేపీని గద్దె దించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మరోవర్గం వారు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తువల్ల జాతీయ స్థాయిలో పార్టీకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ప్రజాస్వామ్య, లోకిక శక్తులను ఐక్యం చేసి, దేశాన్ని పాలిస్తున్న బీజేపీని దెబ్బతీయాలని సూచిస్తున్నారు. దేశంలో మతతత్వాన్ని రెచ్చగొడుతూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీని ఒంటరిగా ఎదుర్కొవడానికి చాలా సమయం పడుతుందని ఏచూరి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిస్తేనే బీజేపీకి కళ్ళెం వేయగలమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఏచూరి ఈ అంశంపై ఒకింత నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానమైన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ముఖ్యనేతల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నట్టు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లోని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్త పొత్తుకు వెళితే పార్టీ బలాన్ని కోల్పోవాల్సి వస్తుందని చర్చల్లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.

చిత్రం..సమావేశం వివరాలను విలేఖరులకు తెలియజేస్తున్న సీతారాం ఏచూరి